మేడ్చల్ జిల్లా కప్రా సర్కిల్ శివసాయి నగర్లో ఓ ఐదేండ్ల బాలికపై వీధికుక్కలు దాడి చేశాయి. ఇంటి ముందు ఆడుకుంటుంన్న చిన్నారిపై కుక్కలు ఒక్కసారిగా దాడిచేసి కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రులు హుటాహుటిన చిన్నారిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి... వైద్యం అందిస్తున్నారు.
వీధి కుక్కల స్వైర విహారం.. చిన్నారిపై దాడి - Street Dog Swarm
మేడ్చల్ జిల్లా కప్రా సర్కిల్ శివసాయి నగర్లో వీధి శునకాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఆ దారిలో వెళ్లేవారిని కరుస్తూ భయానికి గురిచేస్తున్నాయి. తాజాగా ఓ ఐదేండ్ల బాలికపై కుక్కలు దాడిచేశాయి. ఈ ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలవ్వగా... తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
వీధి కుక్కల స్వైర విహారం.. చిన్నారిపై దాడి
తరచుగా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని కాలనీవాసులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధికుక్కల బెడద నుంచి తమను రక్షించాలని వేడుకున్నారు.
ఇదీ చదవండి:14 ఏళ్ల బాలికపై తండ్రీకొడుకులు అత్యాచారం