తెలంగాణ

telangana

ETV Bharat / crime

పశువుల దాణాలో గంజాయి పెట్టి రవాణా.. 800 కేజీలు స్వాధీనం - ganja seized news

Ganja Seized in Hyderabad: హైదరాబాద్​లో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఆంధ్రా- ఒడిశా స‌రిహ‌ద్దు నుంచి యూపీలోని బులందాషహర్‌కు 800 కిలోల గంజాయిని త‌ర‌లిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 800 కిలోల గంజాయి, లారీ, రెండు చ‌ర‌వాణులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేశారు.

ganja seized
గంజాయి స్వాధీనం

By

Published : May 8, 2022, 6:07 PM IST

Ganja Seized in Hyderabad: గంజాయి అక్రమ రవాణాపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అందుకు తగినట్లుగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా అడ్డుకట్ట పడటం లేదు. నేడు హైదరాబాద్‌ మీదుగా ఉత్తరప్రదేశ్​కు అక్రమంగా త‌ర‌లిస్తున్న 800 కిలోల గంజాయిని శంషాబాద్​, ఎస్​వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రా ఒడిశా స‌రిహ‌ద్దు నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులందా షహ‌ర్‌కు గంజాయిని త‌ర‌లిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. ఇద్దరు అంత‌రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేశారు.

పశువుల‌ దాణాల‌కు వాడే ప‌త్తిగింజ‌ల పొట్టు లోప‌ల గంజాయిని పెట్టి గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప‌క్కా స‌మాచారంతో శంషాబాద్ పోలీసులు, ఎస్​వోటీ సిబ్బంది లారీని అడ్డుకుని తనిఖీలు చేశారు. భారీ ఎత్తున గంజాయి పట్టుబడటంతో ఇద్దరు నిందితుల‌ను అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఒక లారీ, రెండు చ‌ర‌వాణులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ రూ. 2 కోట్లు ఉంటుంద‌ని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details