తెలంగాణ

telangana

ETV Bharat / crime

రూ.2,800కు కొన్నారు.. రూ.45వేలకు అమ్ముతున్నారు...

'రెమ్​డెసివిర్' ఇంజక్షన్లను బాక్ల్ మార్కెట్​లో విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ దందాపై సమాచారం అందుకున్న టాస్క్​ఫోర్స్, సుబేదారి పోలీసులు సంబంధిత ఆసుపత్రి మందుల దుకాణంపై దాడులు నిర్వహించారు. వారి నుంచి 28 రెమ్​డెసివిర్ ఇంజక్షన్లతో పాటు 20వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

By

Published : May 6, 2021, 5:58 PM IST

remdesivir injection, black market, warangal
remdesivir injection, black market, warangal

రెమ్​డెసివిర్ ఇంజక్షన్లతో బాక్ల్ మార్కెట్ దందాకు పాల్పడుతోన్న ముగ్గురు సభ్యుల ముఠాను వరంగల్‌ పోలీసులు అరెస్ట్​ చేశారు. కరోనా వ్యాధిగ్రస్థులకు అత్యవసర సమయాల్లో అందించే రెమ్​డెసివిర్ ఇంజక్షన్లను ఎంఆర్​పీ కన్నా అత్యధిక ధరలతో అమ్ముతున్న ఈ ముఠాను వరంగల్‌ టాస్క్​ఫోర్స్, సుబేదారి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్​చేశారు. వీరి నుంచి 28 ఇంజక్షన్లతో పాటు 20వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ప్రస్తుతం కరోనా తీవ్రత అధికంగా ఉండడం వల్ల ఎక్కువ మంది బాధితులు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి తెలిపారు. కరోనా చికిత్సలో భాగంగా అత్యవసర సమయంలో అందించే రెమ్​డెసివిర్ ఇంజక్షన్ల వినియోగం ఎక్కువ అయిందన్నారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో లేకపోవడంతో ఇదే అదునుగా భావించి స్థానిక ఆసుపత్రులు, మెడికల్​ షాపుల వారు బ్లాక్ మార్కెట్ ద్వారా అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని స్పష్టం చేశారు.

నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మందుల దుకాణాన్ని నిర్వహిస్తున్న ఈ ముఠా సభ్యులు హెటిరో ఫార్మా నుంచి రెమ్​డెసివిర్ ఇంజక్షన్లను ఒక్కొక్కటి రూ.2,800 కొనుగోలు చేశారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో లేకపోవడంతో బాధితులకు రూ.45వేల వరకు విక్రయిస్తున్నారని తరుణ్ జోషి తెలిపారు.

ఇదీ చూడండి:కొవిడ్‌పై అవగాహన కోసం ఈటీవీ భారత్ ఫోన్‌ కార్యక్రమం

ABOUT THE AUTHOR

...view details