రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల శివారులోని తుర్కపల్లిలో కూలీల గుడిసెలకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. ఘటనలో సుమారు మూడు లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. అగ్ని ప్రమాదంలో షేక్ బీబీ, సయ్యద్ అంకుష్కు చెందిన రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. నగదు, బంగారం, సామగ్రి కాలిపోయాయి.
నిప్పంటుకుని 2 గుడిసెలు దగ్ధం.. 3 లక్షల ఆస్తి నష్టం - huts burnt in fire accident at thurkapally village
రాజన్న సిరిసిల్ల జిల్లా తుర్కపల్లిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో కూలీల గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తుర్కపల్లిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో కూలీల గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ. 3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని స్థానికులు తెలిపారు.
సర్పంచ్ కదిరే రజిత, వైస్ ఎంపీపీ కదిరే భాస్కర్.. బాధితులకు తక్షణ సాయం కింద 30 కిలోల బియ్యం, రూ.1000, నిత్యావసర వస్తువులు అందించారు. వీరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు సహాయం చేశారు.
ఇదీ చదవండి:అతనికి తెలియదు అమ్మ లేదని.. చెల్లి రాదని...!