తెలంగాణ

telangana

ETV Bharat / crime

fake seeds: నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు - తెలంగాణ న్యూస్ అప్​డేట్స్

కుమురం భీం జిల్లాలో 150 కిలోల నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కుమురం భీం జిల్లా ఎస్పీ వైవీఎస్‌ సుధీంద్ర హెచ్చరించారు

fake seeds
fake seeds

By

Published : Jun 12, 2021, 8:22 AM IST

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కుమురం భీం జిల్లా ఎస్పీ వైవీఎస్‌ సుధీంద్ర హెచ్చరించారు. శుక్రవారం జిల్లాలో వేర్వేరుగా పట్టుకున్న నకిలీ పత్తి విత్తనాల వివరాలను స్థానిక పోలీస్‌ స్టేషన్‌ వద్ద అదనపు ఎస్పీ అచ్చేశ్వర్‌రావుతో కలసి వెల్లడించారు. నకిలీ విత్తనాలు నిల్వ ఉన్నట్లు వచ్చిన సమాచారంతో మండలంలోని పర్సనంబాల గ్రామం బాబురావు ఇంట్లో పోలీసులు తనిఖీ చేయగా 100 కేజీలు లభించాయన్నారు. స్థానిక బస్టాండ్‌ వద్ద వెంకటేశ్‌ అనే వ్యక్తి వద్ద 50 కేజీల నకిలీ విత్తనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు.

సదరు వ్యక్తి రెబ్బెన మండలం ఇంద్రానగర్‌కు చెందిన వారుగా గుర్తించామన్నారు. ఈయనను విచారించగా తిరుపతి వద్ద నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారన్నారు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. 150 కేజీల విత్తనాలు స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేశామన్నారు. పట్టుకున్న విత్తనాల విలువ రూ.మూడు లక్షలు ఉంటుందన్నారు. జిల్లాలో ఈ నెలలో ఇప్పటి వరకు ఆరుగురిపై కేసులు నమోదు చేసి 310 కేజీల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా గ్రామాల్లో నకిలీ విత్తనాలు విక్రయించేందుకు వస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. నకిలీ విత్తనాల సమాచారం తెలుసుకున్న ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు మహేష్‌, రమేశ్‌లను ఎస్పీ అభినందించి రివార్డు అందజేశారు. సమావేశంలో ఎస్‌హెచ్‌వో ఆకుల అశోక్‌, ఎస్‌ఐలు వెంకటేశ్‌, గంగన్న, రాజేశ్వర్‌, తేజస్విని, పోలీసు సిబ్బంది ఉన్నారు.

ఇదీ చదవండి:పర్యాటక రంగంపై కరోనా పిడుగు.. దుర్భర స్థితిలో గైడ్లు!

ABOUT THE AUTHOR

...view details