తెలంగాణ

telangana

ETV Bharat / crime

వైన్‌ షాప్‌లో చోరీ.. రూ. 15 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగుడు - పెద్దకొత్తపల్లిలో వైన్‌ షాప్‌లో చోరీ

నాగర్‌ కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని మద్యం దుకాణంలో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. దుండగుడు షాప్‌ లోపలికి ప్రవేశించి రూ. 15 లక్షలు దోచుకెళ్లాడు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

robbery in wine shop. pedda kothapally
వైన్‌ షాప్‌లో చోరీ.

By

Published : Jan 25, 2021, 12:03 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని ఓ మద్యం దుకాణంలో ఆదివారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. సుమారు రూ. 15లక్షలు పోయినట్లుగా దుకాణదారులు పేర్కొన్నారు. దుండగుడు మెట్ల ద్వారా దుకాణం పైభాగానికి ఎక్కి.. మెట్ల ద్వారా లోపలికి ప్రవేశించినట్లు ఘటనాస్థలంలోని ఆనవాళ్ల ద్వారా పోలీసులు నిర్ధరించారు. అతను డబ్బులు తీసుకుని పారిపోతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా ఒక్కడే చోరీకి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

ఉదయం దుకాణం తెరిచేందుకు నిర్వాహకులు వెళ్లగా.. దొంగతనం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:గోదాములో అగ్నిప్రమాదం... భారీగా ఎగసిపడుతున్న మంటలు

ABOUT THE AUTHOR

...view details