తెలంగాణ

telangana

ETV Bharat / crime

Realtors Arrested for Playing Poker : పేకాట ఆడిన 12 మంది స్థిరాస్తి వ్యాపారులు అరెస్టు - పేకాట ఆడిన రియల్టర్ల అరెస్టు

Realtors Arrested for Playing Poker : హైదరాబాద్​ గచ్చిబౌలిలో పేకాట రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంబర్​పేట్​కు చెందిన మార్కారెడ్డి.. గచ్చిబౌలిలో ఫ్లాట్ అద్దెకు తీసుకుని పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. పేకాడుతున్న 12 మంది స్థిరాస్తి వ్యాపారులను అరెస్టు చేశారు.

Realtors Arrest for Playing Poker
Realtors Arrest for Playing Poker

By

Published : Jan 22, 2022, 12:44 PM IST

Realtors Arrested for Playing Poker : భాగ్యనగరంలోని గచ్చిబౌలిలో పేకాట శిబిరం గుట్టు రట్టైంది. పేకాట ఆడుతున్న 12 మంది స్థిరాస్తి వ్యాపారులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.9 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

పేకాట ఆడిన 12 మంది స్థిరాస్తి వ్యాపారులు అరెస్టు

Realtors Arrested for Playing Poker in Hyderabad : శిబిరంపై దాడి చేసిన మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు పాపిరెడ్డి(అల్వాల్), కార్తీక్‌ గౌడ్‌, సంతోశ్​ (ఎ​ల్బీనగర్‌), సతీశ్​(సంతోశ్​ నగర్‌), సీర్లరెడ్డి(సిద్దిపేట), రామయ్య(మెదక్‌), వెంకట నర్సింహరాజు(అల్వాల్‌), సద్గురురెడ్డి(బీరంగూడ), కృష్ణ(బీరంగూడ), అప్పలరాజు(గండిపేట)లను అదుపులోకి తీసుకున్నారు. అంబర్‌పేట్‌కు చెందిన మర్కారెడ్డి గచ్చిబౌలిలో ఫ్లాట్‌ అద్దెకు తీసుకొని పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

పేకాటరాయుళ్ల నుంచి రూ.9 లక్షలు స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details