తెలంగాణ

telangana

ETV Bharat / city

డీఈవో ఛాంబర్‌కు తాళం వేసిన తహసీల్దార్‌.. కారణం ఏమిటంటే? - కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈఓ కార్యాలయానికి తాళం

భూపాలపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఛాంబర్‌కు తహసీల్దార్‌ మహమ్మద్ ఇక్బాల్‌ తాళం వేశారు. తరచూ విధులకు గైర్హాజరు అవుతున్నారని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నారు.

Lock to DEO Office
Lock to DEO Office

By

Published : Jun 25, 2022, 7:57 PM IST

భూపాలపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి తరచూ విధులకు గైర్హాజరు అవుతున్నారని జిల్లా కలెక్టర్ బవేష్ మిశ్రా ఆదేశాల మేరకు తహసీల్దార్ మహమ్మద్ ఇక్బాల్ డీఈఓ కార్యాలయనికి తాళం వేశారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరు అవుతున్నారని కలెక్టర్‌ దృష్టికి రావడంతో... కార్యాలయానికి తాళం వేయాలని జిల్లా పాలనాధికారి ఆదేశించారు. దీనితో స్థానిక తహసీల్దార్ చర్యలు తీసుకున్నారు. అదే క్రమంలో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం డీఈఓకు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన ఏఐఎస్ఎఫ్​ స్టూడెంట్ యూనియన్ నాయకులు.. డీఈఓ లేకపోవడంతో తాళం వేసిన కార్యాలయ తలుపు వద్ద వినతి పత్రం ఉంచారు.

విద్యాశాఖ అధికారి విధులకు హాజరు కాకుండా నిర్లక్ష్యం చేస్తుండడంతో జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల్లో ఆగడాలు పెరిగిపోయాయని ఏఐఎస్ఎఫ్​ స్టూడెంట్ యూనియన్ నాయకులు ప్రవీణ్ అన్నారు. ఫీజుల నియంత్రణ లేకపోవడంతో అధిక ఫీజులు వసూలు చేస్తూ పిల్లలను, తల్లిదండ్రులను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇబ్బందులు పెడుతున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రైవేట్​ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని.. జిల్లాకు శాశ్వత విద్యాశాఖ అధికారిని నియమించాలని వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న డీఈఓను సస్పెండ్ చేయాలని కోరారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details