నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో నూతన ఓటరు జాబితా తయారుకు వరంగల్ అర్బన్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు...షెడ్యూల్ను ప్రకటించారు. అక్టోబర్ ఒకటిన ఓటరు నమోదుకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఓటరు నమోదుకు దరఖాస్తుకు నవంబర్ 6వ తేదీ వరకూ గడువు ఉంటుంది. ఓటరు ముసాయిదా జాబితాను నవంబర్ 25వ తేదీన ముద్రించి.. డిసెంబర్ 1న జాబితాను ప్రచురిస్తారు.
'అక్టోబర్ ఒకటి నుంచి ఓటరు నమోదుకు అవకాశం'
నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో నూతన ఓటరు జాబితా తయారుకు వరంగల్ అర్బన్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు...షెడ్యూల్ను ప్రకటించారు. అక్టోబర్ ఒకటి నుంచి ఆరు వరకు ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబర్ ఒకటిన విడుదల కానుంది.
'అక్టోబర్ ఒకటి నుంచి ఓటరు నమోదుకు అవకాశం'
ప్రచురించిన ఓటరు జాబితాపై అభ్యంతరాలకు సంబంధించిన ఫిర్యాదులను... డిసెంబర్ 1 నుంచి 31 వరకు స్వీకరిస్తారు. అభ్యంతరాలను జనవరి 12వ తేదీ వరకూ పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. జనవరి 18న ఎన్నికలకు సంబంధించి ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తామని చెప్పారు.
ఇవీ చూడండి:చుక్కల్లో కూరగాయల ధరలు.. బెంబేలెత్తుతున్న సామాన్యులు