వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో పాలిసెట్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష జరగనుంది. పాలిటెక్నిక్, వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్‌కు వరంగల్ నగరంలో 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5,754 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
పక్కా ఏర్పాట్లు.. ప్రారంభమైన పాలిసెట్ - warangal news
పాలిసెట్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది.. మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష జరగనుంది. వరంగల్ నగరంలో 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పక్కా ఏర్పాట్లు.. ప్రారంభమైన పాలిసెట్
నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికారుల హెచ్చరికలతో గంట ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. కొవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి వచ్చారు. ప్రతి విద్యార్థిని శానిటేషన్ చేసి లోపలికి పంపించారు.
ఇవీచూడండి:దుర్వినియోగమవుతున్న సామాజిక మాధ్యమాలు