Minister Satyavathi rathod gherav by Trs Activists: ములుగు జిల్లా పర్యటనకు వెళ్లిన మంత్రి సత్యవతి రాఠోడ్‌కు సొంతపార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగ ఎదురైంది. అధికార పార్టీ శ్రేణులే మంత్రిని అడ్డుకోవడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మంత్రి గట్టమ్మ దగ్గరకి రాగానే తెరాస ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఆమెను అడ్డుకున్నారు.
వర్షాన్ని కూడా లెక్కచేయకుండా అక్కడకు చేరుకున్న దళితులు కాన్వాయ్‌ను ముందుకు వెళ్లకుండా భీష్మించుకుని కూర్చుకున్నారు. ములుగు గడ్డ పైన అడుగు పెట్టొద్దంటూ నినాదాలు చేశారు. జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీష్.. మంత్రి సత్యవతి రాఠోడ్ కాళ్లు పట్టుకొని మరీ దళితులకు న్యాయం చేయాలని వేడుకున్నారు. దళితబంధు జిల్లాలో అర్హులైన వారికి ఎందుకు ఇస్తలేరని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న దళితులకు దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌కు వ్యతికేంగా ఉన్నవారికి దళిత బంధు ఇస్తున్నారని వాపోయారు. ఉమ్మడి జిల్లా మంత్రులందరూ కలిసి ములుగు ఎమ్మెల్యేతో సమాధానం పడటం ఏంటీ అని మండిపడ్డారు. మీ రహస్య ఒప్పందాలు ఏమిటో కార్యకర్తలకు వివరించాలని పట్టు పట్టారు.