తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రపంచమే హర్షించే స్థాయిలో కేసీఆర్ పాలన: ఎర్రబెల్లి - మంత్రి ఎర్రబెల్లి తాజా ప్రసంగం

తాగునీటి సమస్య తీర్చిన మహానుభావుడు కేసీఆర్​ అని కొనియాడారు మంత్రి ఎర్రబెల్లి. వరంగల్​గ్రామీణ జిల్లా కలెక్టర్​ కార్యాలయం జరిగిన ఆవిర్భావ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ప్రపంచమే హర్షించే రీతిలో తెలంగాణ ప్రభుత్వ పాలన సాగుతుందన్నారు. ఎస్ఆర్​ఎస్పీకి కాళేశ్వరం నీళ్లురావడంపై హర్షం వ్యక్తం చేశారు.

రంగల్​గ్రామీణ జిల్లా కలెక్టర్​ కార్యాలయం  రాష్ట్ర ఆవిర్భావ వేడుక
రంగల్​గ్రామీణ జిల్లా కలెక్టర్​ కార్యాలయం రాష్ట్ర ఆవిర్భావ వేడుక

By

Published : Jun 2, 2020, 3:29 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టరేట్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి ఎర్రబెల్ల దయాకర్​రావు జాతీయ జెండాను ఎగురవేసి, అమరవీరులకు నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో మంత్రినైనందుకు గర్వపడుతున్నానన్నారు. తనకు అవకాశం ఇచ్చిన కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామాల్లో తాగునీటి సమస్య తీర్చిన మహానుభావుడు కేసీఆర్​ అని కొనియాడారు. ఎస్ఆర్​ఎస్పీకి కాళేశ్వరం నీళ్లురావడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి వాటన్నింటిని తీరుస్తూ ప్రపంచమే హర్షించే రీతిలో పాలన సాగిస్తున్నారని ప్రశంశించారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు బాగుపడ్డాయని అందుకే గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి కాలేదన్నారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో ఎవరైనా అలసత్వం చూపితే వేటు తప్పదని హెచ్చరించారు.

కార్యక్రమంలో కలెక్టర్ హరిత, సీపీ వి.రవీందర్, జెడ్పీ ఛైర్మన్ గండ్ర జ్యోతి, నర్శంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శనరెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు.

రంగల్​గ్రామీణ జిల్లా కలెక్టర్​ కార్యాలయం రాష్ట్ర ఆవిర్భావ వేడుక

ఇవీ చూడండి: అవతరణ వేడుకల్లో కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి

ABOUT THE AUTHOR

...view details