తెలంగాణ

telangana

ETV Bharat / city

తెరాస పతనం మొదలైంది : మాజీమంత్రి కొండా సురేఖ - మాజీ మంత్రి కొండా సురేఖ

వరంగల్​ నుంచే తెలంగాణ రాష్ట్ర సమితి పతనం మొదలయిందని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్​ అర్బన్​ జిల్లా 14వ డివిజన్​కు చెందిన 200 మంది తెరాస కార్యకర్తలకు ఆమె కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే శాసన సభ ఎన్నికల్లో వరంగల్​ తూర్పు నియోజక వర్గం నుంచి బరిలో దిగుతానని ఆమె తెలిపారు. సమస్యల పరిష్కారంలో ప్రస్తుత ఎమ్మెల్యే విఫలమయ్యారని ఆమె ఆరోపించారు.

konda surekha fires on TRS
తెరాస పతనం మొదలైంది : కొండా సురేఖ

By

Published : Sep 12, 2020, 9:53 AM IST

రాష్ట్రంలో తెరాస పతనం మొదలైందని.. వరంగల్ నుంచే అది ఆరంభమైందని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్​ అర్బన్​ జిల్లా పట్టణ కేంద్రంలోని 14వ డివిజన్​కు చెందిన 200 తెరాస కార్యకర్తలను ఆమె కాంగ్రెస్​ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే సహకారంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో వరంగల్​ మేయర్​ పదవిని చేజిక్కించుకుంటామని, బీసీ నాయకుడిని మేయర్​ చేస్తామని ఆమె అన్నారు. వరంగల్​ తూర్పు నియోజవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలిపారు. ఇప్పటి ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్​ చేశారు. భారీ వర్షాలకు నియోజకవర్గంలోని రహదారులు దెబ్బతింటే.. వాటిని మరమ్మత్తులు చేసి పట్టించుకునే స్థితిలో ఎమ్మెల్యే లేరని ఆమె ఆరోపించారు. పట్టణంలోని నాళాలను తెరాస నేతలు ఆక్రమించడం వల్లే.. మొన్నటి వర్షాలకు వరంగల్​ జలమయమైందని ఆగ్రహించారు.

ABOUT THE AUTHOR

...view details