తెలంగాణ

telangana

ETV Bharat / city

చెరువు మత్తడిపై ఉద్యమ జ్ఞాపకాలు.. గుర్తు చేసుకున్న కేసీఆర్‌ - సీఎం కేసీఆర్ భద్రాద్రి పర్యటన

CM KCR: గోదావరి వరద ధాటికి ఛిద్రమైన పలు ప్రాంతాల్లో ఆదివారం ముఖ్యమంత్రి విస్తృతంగా పర్యటించారు. హనుమకొండ నుంచి భద్రాచలం వరకు అనేకచోట్ల రహదారిపై పొంగిపొర్లే వరదలో నుంచే కేసీఆర్‌ బస్సు ప్రయాణం సాగింది. ఈ క్రమంలో ఆత్మకూరు మండలం కటాక్షపూర్‌ పెద్ద చెరువు వద్దకు రాగానే తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను కేసీఆర్ నెమరువేసుకున్నారు.

CM KCR
CM KCR

By

Published : Jul 18, 2022, 10:21 AM IST

CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ఉదయం రోడ్డు మార్గంలో హనుమకొండ నుంచి భద్రాచలం వెళ్తూ మధ్యలో ఆత్మకూరు మండలం కటాక్షపూర్‌ పెద్ద చెరువు వద్దకు రాగానే తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ‘అప్పట్లో ఈ చెరువు మీదుగా వెళ్తుంటే మత్తడి వద్ద చాలా మంది మత్స్యకారులు చేపలు పడుతూ కనిపించేవారు. వారు కూడా జై తెలంగాణ అంటూ నినదించేవారు’ అని కేసీఆర్‌ గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు వరద ఎక్కువగా వస్తే రోడ్డు మునిగిపోయి.. వాహనాలు నిలిపేయాల్సి వస్తోందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వివరించగా.. వంతెన మంజూరైందని, త్వరలోనే పూర్తవుతుందని సీఎం బదులిచ్చారు. దట్టమైన అటవీమార్గంలో నాలుగు గంటలపాటు ఆయన పయనించారు.

ABOUT THE AUTHOR

...view details