ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలందుతున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ఆక్సిజన్, మందుల కొరత లేదని స్పష్టం చేశారు. పరిస్ధితి విషమంగా ఉన్న రోగులు.. ఎంజీఎంకు వచ్చి కోలుకుంటున్నారని చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఆగం కావద్దని సూచించారు.
Oxygen : ఎంజీఎంకు రూ.20లక్షలు విలువ చేసే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు
ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందుతోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రూ.20 లక్షలు విలువ చేసే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఫ్లోమీటర్లు, మాస్కులు అందించిన 1986 బ్యాచ్‌కు చెందిన వైద్యులు, కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి ఎర్రబెల్లి, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి
బ్లాక్ ఫంగస్ రోగుల కోసం.. యాభై పడకలతో ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. 1986 బ్యాచ్‌కు చెందిన వైద్యులు, కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్ ప్రవీణ్‌లు కలిసి 20 లక్షల రూపాయలు విలువ చేసే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఫ్లో మీటర్లు, మాస్కులు అందచేయడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు.