తీవ్ర వాయుగుండం ప్రభావంతో... వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్, కాజీపేట, హన్మకొండ ప్రాంతాల్లో ఉదయం మోస్తరుగా కురిసినా.. ఆ తరువాత వర్షం జోరందుకుంది.
జోరువానలు... పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు - ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జోరుగా వానలు
దీంతో రహదారులు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు, కొత్తగూడ, గంగారం, బయ్యారం, గార్ల మండలాల్లో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. వరంగల్ గ్రామీణ జిల్లా, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.
ఇవీ చూడండి: తీరాన్ని దాటిన తీవ్ర వాయుగుండం.. నాలుగైదు గంటలు వర్షగండం