గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో విజయం కోసం పార్టీలు, అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. అధికార తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది. అభ్యర్థులూ ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కొన్ని పార్టీల అభ్యర్థులు కాళ్లు మొక్కి మరీ తమనే గెలిపించాలని వేడుకుంటున్నారు.
గ్రేటర్ వరంగల్‌లో ఎన్నికల హోరు.. పోటాపోటీగా ప్రచారజోరు - warangal corporation election campaign
గ్రేటర్ వరంగల్‌లో ప్రచారం జోరందుకుంది. అభ్యర్థులతో పాటు ప్రధాన పార్టీల ముఖ్యనేతలు వారికి తోడుగా పర్యటిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లడుగుతున్నారు.
గ్రేటర్ వరంగల్, గ్రేటర్ వరంగల్ ఎన్నికలు, గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారం
42, 43 డివిజన్లలో పోటాపోటీగా ప్రచారం జరుగుతోంది. తమ కంటే తమకే ఓట్లు వేయాలంటూ వివిధ పార్టీల అభ్యర్థులు ఓటర్లను కోరుతున్నారు. సంక్షేమ పథకాలు పేరుతో అధికార తెరాస ఓట్లడుగుతుండగా.. భాజపా, కాంగ్రెస్‌లు పరస్పర విమర్శలు గుప్పిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.
- ఇదీ చదవండి :గ్రేటర్ వరంగల్ బరిలో రౌడీషీటర్లు