గ్రేటర్ వరంగల్ పరిధిలో తొలిరోజు 13 మంది అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేశారు. వరంగల్ ఎల్బీ కళాశాల, హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నామినేషన్ల దాఖలుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎల్బీ కళాశాలలో 32, ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాలలో 34 డివిజన్లలో పోటీ చేసే అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. తెరాస, భాజపా, కాంగ్రెస్‌తో పాటు పలువురు స్వతంత్రులు కూడా తొలిరోజు నామపత్రాలు సమర్పించారు.
మినీ పోల్స్: వరంగల్‌లో తొలిరోజు 13 మంది నామినేషన్లు - నామినేషన్ల పర్వం
మినీ పోల్స్‌లో భాగంగా... తెరాస, భాజపా, కాంగ్రెస్‌తో పాటు పలువురు స్వతంత్రులు తొలిరోజు నామపత్రాలు సమర్పించారు. మొదటి రోజు కావటం.. పార్టీలు అధికారిక జాబితా వెల్లడించకపోవటం వల్ల.. నామినేషన్లు దాఖలు చేసిన వారి సంఖ్య తక్కువగానే ఉంది.
first day of nominations in warangal municipal corporation
మొదటి రోజు కావటం.. పార్టీలు అధికారిక జాబితా వెల్లడించకపోవటం వల్ల.. నామినేషన్ దాఖలు చేసిన వారి సంఖ్య తక్కువగానే ఉంది. చాలామంది కేంద్రాల వద్దకు వచ్చి నామినేషన్ పత్రాలను తీసుకువెళ్లారు. రేపు, ఎల్లుండి పెద్ద సంఖ్యలో అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇటు నామినేషన్ దాఖలు చేసే కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.
నామినేషన్ వేసినవారి వివరాలు...
- 2వ డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సుధీర్
- 4వ డివిజన్ నుంచి కాంగ్రెస్ తరఫున రేపల్లె శ్రీరంగనాథ్
- 6వ డివిజన్ నుంచి కాంగ్రెస్ తరఫున బొమ్మటి విక్రమ్
- 23వ డివిజన్ నుంచి కాంగ్రెస్ తరఫున చిప్పా లక్ష్మి
- 27వ డివిజన్ నుంచి భాజపా తరఫున చింతాకుల అనిల్ కుమార్
- 30వ డివిజన్ నుంచి భాజపా తరఫున కోమల
- 31 డివిజన్ నుంచి తెరాస తరఫున మోహన్ రావు
- 32వ డివిజన్ నుంచి తెరాస అభ్యర్ధిగా బొల్లం శ్రీదేవి
- 34వ డివిజన్ నుంచి భాజపా తరఫున గంటా రవికుమార్
- 39వ డివిజన్ నుంచి తెరాస అభ్యర్ధిగా కొమ్మిని సురేశ్
- 52వ డివిజన్ నుంచి ఏఐఎఫ్బీ తరఫున పుప్పాల రజనీకాంత్
- 53వ డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా క్రాంతికుమార్
- 61వ డివిజన్ నుంచి తెరాస తరఫున సంపత్ రెడ్డి