వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీపంలోని ఒక హోటల్లో వంట గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ ఆస్తి నష్టం జరిగింది. కడాయి నుంచి నూనె ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పై పడి మంటలు వచ్చాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. హోటల్ యజమాని కనీస భద్రతను పాటించకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని ఫైర్ సిబ్బంది తెలిపారు. ఘటన జరిగిన చోట పదికి పైగా గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని అవి కూడా పేలి ఉంటే భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఉండేదని తెలిపారు. హోటల్ యజమానిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు.
యజమాని నిర్లక్ష్యం..హోటల్లో అగ్ని ప్రమాదం...
హోటల్ యజమాని నిర్లక్ష్యం వల్ల వ్యవసాయ మార్కెట్ సమీపంలో మంటలు చెలరేగాయి. కనీస భద్రతలు పాటించకుండా వ్యవహరించినందుకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
హోటల్లో వంట గ్యాస్ లీకై చెలరేగిన మంటలు