భూసేకరణ జీవో 80-ఏను రద్దు చేయాలంటూ వరంగల్ జిల్లా రైతులు పెద్దఎత్తున కదం తొక్కారు. హనుమకొండ- హైదరాబాద్ జాతీయ రహదారిపై కిలోమీటర్ మేర బైఠాయించి నిరసన తెలిపారు. జీవోను వెంటనే రద్దు చేయాలని రైతులు నినాదాలు చేశారు. రైతుల నిరసనలో భాజపా, కాంగ్రెస్, వామపక్ష నేతలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. హనుమకొండ- హైదరాబాద్ హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
ఆ జీవో రద్దు చేయాలంటూ రహదారి దిగ్బంధనం.. రైతు నాయకుల అరెస్ట్..
వరంగల్ జిల్లా రైతులు ఆందోళన బాట పట్టారు. భూసేకరణ జీవో 80 ఏ రద్దు చేయాలంటూ.. హనుమకొండ- హైదరాబాద్ జాతీయ రహదారి దిగ్బంధనం తలపెట్టారు. మరోవైపు.. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనకుండా పలువురు రైతుసంఘ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు.. రైతులు చేపట్టిన జాతీయ రహదారి దిగ్బంధనాన్ని నిర్వీర్యం చేసేందుకు పోలీసులు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా నిరసన తెలిపేందుకు పిలుపునిచ్చిన రైతు సంఘ నాయకులతో పాటు రైతులను అరెస్టు చేయడంపై వివిధ రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రభుత్వంపై నిరసన వ్యక్తం వ్యక్తం చేసే హక్కుందని పేర్కొన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని రైతు ఉద్యమాలను సీఎం కేసీఆర్.. అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. జీవో నంబర్ 80 ఏ రద్దు చేసే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని రైతు సంఘం నాయకులు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: