తెలంగాణ

telangana

ETV Bharat / city

'రాష్ట్రంలో​ డ్రైరన్​ సంతృప్తికరంగా సాగుతోంది' - ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు

వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రిని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ఆకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రిలో డ్రైరన్​ సాగుతున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ ప్రక్రియలో ఎమైనా సమస్యలు తలెత్తుతున్నాయా అన్ని విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

'రాష్ట్రంలో​ డ్రైరన్​ సంతృప్తికరంగా సాగుతోంది'
director-of-public-health-srinivas-rao-visited-warangal-mgm-hospital

By

Published : Jan 8, 2021, 4:03 PM IST

'రాష్ట్రంలో​ డ్రైరన్​ సంతృప్తికరంగా సాగుతోంది'

రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ సంతృప్తికరంగా సాగుతుందని... ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన శ్రీనివాస్​రావు... డ్రైరన్ సాగుతున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. డ్రైరన్ నిర్వహణలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అన్నది... జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1200 కేంద్రాల్లో 20 వేలమంది లబ్దిదారులు... డ్రైరన్​లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేయడానికి ముందుగా... ఈ ప్రక్రియలో ఏమైనా లోపాలు, ఇబ్బందులు ఉంటే తెలుసుకునేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. వారం రోజుల్లోపే వచ్చే వ్యాక్సిన్​ను ప్రజలకు అందించేందుకు అన్ని విధాలా సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఇదీ చూడండి: కలెక్టర్​కు ఇచ్చిన నీళ్ల సీసాలో విషం!

ABOUT THE AUTHOR

...view details