తెలంగాణ

telangana

ETV Bharat / city

హనుమకొండలో కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంభించిన సీజేఐ - హనుమకొండలో సీజేఐ పర్యటన

CJI Inaugurated Hanamkonda court Complex: హనుమకొండలో పది కోర్టుల భవన సముదాయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ.రమణ ప్రారంభించారు. సీనియర్‌ సివిల్‌ కోర్టు హాలును... పోక్సో కోర్టుగా మార్పులు చేశారు. లైంగిక దాడుల కేసుల్లో విచారణకు వచ్చేవారు కనపడకుండా ఏర్పాట్లు చేశారు.

cji nv ramana warangal tour
cji nv ramana

By

Published : Dec 19, 2021, 12:10 PM IST

Updated : Dec 19, 2021, 12:31 PM IST

CJI Inaugurated Hanamkonda court Complex: హనుమకొండలో పది కోర్టుల భవన సముదాయం ప్రారంభమైంది. కోర్టు ప్రాంగణంలో శిలాఫలకాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ.రమణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు సీజే జస్టిస్ సతీశ్‌ చంద్ర శర్మ, న్యాయమూర్తులు జస్టిస్‌ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ నవీన్‌రావు హాజరయ్యారు.

సీనియర్‌ సివిల్‌ కోర్టు హాలును... పోక్సో కోర్టుగా మార్పులు చేశారు. లైంగిక దాడుల కేసుల్లో విచారణకు వచ్చేవారు కనపడకుండా ఏర్పాట్లు చేశారు. చిన్నారులు, తల్లిదండ్రులు, కక్షిదారులు కనపడకుండా ప్రత్యేక ద్వారం నిర్మించారు. విచారణ కోసం ప్రత్యేక గదులున్నాయి. ప్రవేశ మార్గం వద్ద ఆకట్టుకునే రీతిలో కాకతీయ కళాతోరణం... లోపలికి వెళ్లే మార్గంలో పూల మొక్కలు, సందేశాత్మక చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. చిన్నారులు ఆడుకునేందుకు అనువైన వాతావరణం ఏర్పాటు చేశారు.

రెండురోజుల పర్యటనకు నిన్న వరంగల్​ వచ్చిన సీజేఐ జస్టిస్​ ఎన్వీ.రమణ.. హైదరాబాద్‌లో నానక్‌రాంగూడలోని ఫీనిక్స్‌ వీకే టవర్స్‌లోని 21, 22 అంతస్తులలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ కేంద్రాన్ని సీఎం కేసీఆర్​తో కలిసి ప్రారంభించారు. అనంతరం రామప్ప ఆలయాన్ని సీజేఐ సందర్శించారు. ఇవాళ భద్రకాళీ, వేయి స్తంభాల ఆలయాలను సందర్శించారు. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు.

హనుమకొండలో కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంభించిన సీజేఐ

ఇదీచూడండి:CJI at Bhadrakali Temple : భద్రకాళీ, వేయి స్తంభాల ఆలయాల్లో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతుల పూజలు

Last Updated : Dec 19, 2021, 12:31 PM IST

ABOUT THE AUTHOR

...view details