వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని అంగన్ వాడీ కేంద్రాన్ని నిర్వాహకులు ప్లే స్కూల్‌గా మార్చేశారు. పోచమ్మ కుంటలో ఉన్న ఈ కేంద్రంలో ప్రైవేటు ప్లే స్కూల్ మాదిరిగా అన్ని సౌకర్యాలు సమకూర్చారు. ఇక్కడ మూడేళ్ల నుంచి ఐదేళ్ల పిల్లల వరకు ఆడుకునేందుకు ఆట వస్తువులు, బొమ్మల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పిల్లల్లో సృజనాత్మకతను పెంచేందుకు జంతువులు, పక్షులు వంటి వస్తువులను పేర్లతో పరిచయం చేసే ఆటలను ఆడిస్తున్నారు. అట్టముక్కలతో పజిల్స్ తయారు చేసి నేర్పిస్తున్నారు.
ప్లే స్కూల్‌గా మారిపోయిన అంగన్వాడీ కేంద్రం - అంగన్వాడీ స్కూల్
అంగన్వాడీ కేంద్రాలంటే ఒకప్పుడు కేవలం పౌష్టికాహారం పంపిణీ చేసేందుకే ఉన్నాయా అనే భావన ఉండేది. తల్లిదండ్రులూ తమ పిల్లలను ఈ కేంద్రాల కంటే ప్లే స్కూల్స్‌కు పంపేందుకు ఆసక్తి చూపేవారు. కానీ హన్మకొండలో మాత్రం అందుకు భిన్నం. ప్రైవేటు బడులకు దీటుగా వసతులు, సౌకర్యాలు.. ఆరోగ్యకరమైన పౌష్టిక ఆహారాన్ని అందించడమే కారణం.
anganvadi school turned into play school at hanmakonda in warangal urban district
భిన్న రకాల ఆటలు, పాటలతో చిన్నారులకు చదువు చెప్పడం వల్ల ఈ అంగన్వాడీ కేంద్రానికి వచ్చేందుకు చిన్నారులు ఇష్టపడుతున్నారని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.
హన్మకొండలోని అంగన్వాడీ కేంద్రంలాగే... అన్ని కేంద్రాలను అభివృద్ధి చేస్తే... తల్లిదండ్రులకు చిన్నారులను ప్రైవేటు బడులకు పంపే బాధ తప్పుతుంది. అలాగే పిల్లలు ఆనందంగా ఆడుకుంటూ... చదువు కూడా నేర్చుకుంటారని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.
- ఇదీ చూడండి : 'నాన్నా.. నన్ను చంపినా పాడుపనికి వెళ్లను'