ప్రజలు సాధించుకున్న తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబానికి తప్ప ఎవరికీ మేలు జరగలేదని వనపర్తి సభలో రాహుల్ గాంధీ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ఎన్నో ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసినవేనని తెలిపారు. తాము ప్రారంభించిన ప్రాజెక్టుల పేర్లు మార్చి రీడిజైనింగ్ పేరుతో తెరాస ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. అధికారులకు లంచం ఇవ్వనిదే తెలంగాణలో ఏ పనీ జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో, దేశంలో మేడిన్ చైనా వస్తువులు కాదు... మేడిన్ తెలంగాణ వస్తువులు వాడాలని ఆకాంక్షించారు. పేదలు వ్యాపారం చేయడానికి ఎలాంటి అనుమతి అవసరం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏరకమైన అనుమతి లేకుండా కుటీర పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు.
'తెలంగాణలో లంచం ఇవ్వనిదే ఏ పని జరగడం లేదు' - rahul gandhi fire on cm kcr
తెరాస పాలనలో కేసీఆర్ కుటుంబానికి తప్ప ఎవరికి మేలు జరగలేదని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. రాష్ట్రంలో లంచం ఇవ్వనిదే ఏ పని జరగడంలేదని ఆరోపించారు.
!['తెలంగాణలో లంచం ఇవ్వనిదే ఏ పని జరగడం లేదు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2867012-1094-b05e4c23-a956-450f-bbd0-bc7995fd11bb.jpg)
వ్యాపారం చేయడానికి ఎలాంటి అనుమతి అవసరం లేదు: రాహుల్
వ్యాపారం చేయడానికి ఎలాంటి అనుమతి అవసరం లేదు: రాహుల్
Last Updated : Apr 1, 2019, 5:25 PM IST