ETV Bharat / city
నీరు నేలపాలు..
నీటి బొట్టు ప్రగతికి మెట్టు అంటారు... నీరు పెంచు ప్రగతి పంచు అంటారు... ఇవన్నీ మాటలకే పరిమితమయ్యాయి ఇక్కడ. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మిషన్ భగీరథ పైప్ లైను లీకేజీతో వేల లీటర్ల నీరు వృథాగా పోయింది. ఎట్టకేలకు స్పందించిన అధికారులు నీటి సరఫరా ఆపి మరమ్మతులు చేస్తున్నారు.
పైపు లీకేజీ
By
Published : Mar 5, 2019, 11:09 AM IST
| Updated : Mar 5, 2019, 11:36 AM IST
సూర్యాపేట పట్టణంలోని శాంతినగర్లో మిషన్ భగీరథ ప్రధాన పైపులైను లీక్ అయింది. ఈ ప్రాంతం నుంచే రోజూ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వెళ్తుంటారు. వారం రోజులుగా నీరు వృథాగా పోయినా పట్టించుకోలేదు. వాచర్ సరిపోయేది లేదని...
లీకేజీ అరికట్టేందుకు వాల్ వాచర్ సరిపడేవి లేవని అధికారులు చెబుతున్నారు. ఫలితంగా వారం రోజులుగా తాగునీరు నేలపాలైంది. స్థానికుల ఒత్తిడి మేరకు... ఎట్టకేలకు ఇవాళ అధికారులు మరమ్మతులు చేపట్టనున్నారు. పనులు పూర్తయ్యే వరకు.. పట్టణంలోని 34 వార్డుల్లో నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు... ప్రజలు సహరించాలని కోరారు.
Last Updated : Mar 5, 2019, 11:36 AM IST