తెలంగాణ

telangana

ETV Bharat / city

'చౌకీదార్లు, టేకేదార్లు కాదు.. జిమ్మేదారు కావాలి' - KTR COMMENTS ON PM MODI

కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అండగా ఉండాల్సిన ప్రధాని అడుగడుగునా అవమానించుకుంటూ వచ్చారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ మండిపడ్డారు. దేశానికి కావల్సింది చౌకీదార్లు, టేకేదార్లు కాదు... జిమ్మేదారని అన్నారు.

తెలంగాణకు ఒక్క కేంద్ర మంత్రి పదవైనా ఇచ్చారా ?..:కేటీఆర్

By

Published : Mar 25, 2019, 8:57 PM IST

Updated : Mar 26, 2019, 7:31 AM IST

ఐదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు ఒక్క కేంద్ర మంత్రి పదవైనా ఇచ్చారా అని కేటీఆర్​ ప్రశ్నించారు. కేంద్రమంత్రివర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం కల్పించని మోదీకి ఎందుకు ఓటెయ్యాలన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్టాన్ని అడుగడుగునా ప్రధాని అవమానించుకుంటూ వచ్చారని మండిపడ్డారు. 16 మంది ఎంపీలుంటే కాళేశ్వరానికి జాతీయ హోదా వస్తుందన్నారు. ఈ దేశానికి కావల్సింది చౌకీదార్లు, టేకేదార్లు కాదు... జిమ్మేదారులు కావాలన్నారు. దేశానికి మాటల మనిషి కాకుండా... కేసీఆర్‌ లాంటి చేతల మనిషి కావాలన్నారు. దిల్లీని శాసించే శక్తిగా తెరాస మారబోతుందని సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో అన్నారు.

తెలంగాణకు ఒక్క కేంద్ర మంత్రి పదవైనా ఇచ్చారా ?..:కేటీఆర్

Last Updated : Mar 26, 2019, 7:31 AM IST

ABOUT THE AUTHOR

...view details