తెలంగాణ

telangana

ETV Bharat / city

నాయనమ్మను ఆదరించిన గడ్డమీద మనవడి ప్రచారం - 2019 elections

ఇందిరాగాంధీ కుటుంబానికి మెదక్ జిల్లాతో ప్రత్యేక అనుబంధం. అత్యవసర పరిస్థితుల్లో పదవి, అధికారాన్ని కోల్పోయిన ఇందిరకు మరిచిపోలేని ఆధిక్యతనిచ్చారు ఇక్కడి ఓటర్లు. కృతజ్ఞతగా ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపించింది. ఇందిర కుటుంబసభ్యులూ అంతే అభిమానాన్ని చూపిస్తున్నారు.

మెదక్​తో ఇందిరాగాంధీ కుటుంబానిది ప్రత్యేక అనుబంధం

By

Published : Apr 1, 2019, 5:02 PM IST

Updated : Apr 2, 2019, 6:59 PM IST

మెదక్​తో ఇందిరాగాంధీ కుటుంబానిది ప్రత్యేక అనుబంధం
అత్యవరస పరిస్థితితో రాజకీయంగా నష్టపోయిన ఇందిరాగాంధీని మెదక్ ప్రజలు ఆదరించారు. సొంత నియోజకవర్గాన్ని కాదనుకొని ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించేలా చేసింది వారి అభిమానం. ఇందిరాగాంధీతోపాటు కుటుంబసభ్యులూ మెదక్​పై ప్రత్యేకతను చాటుతున్నారు. ఎన్నికలప్పుడు కచ్చితంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని 2017 జూన్​లో సంగారెడ్డి నుంచే పూరించారు.

రాహుల్ జహీరాబాద్ సభ రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాన హామీ కనీస ఆదాయ పథకాన్ని ప్రకటించిన తరువాత తెలంగాణలో పాల్గొన్న మొదటి సభ కావటం వల్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకరోజు ముందే హైదరాబాద్ చేరుకున్న రాహుల్... స్థానిక రాజకీయ పరిస్థితులు, ప్రజల ఆకాంక్షలు, హామీలపై రాష్ట్ర నేతలతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఎమ్మెల్సీ ఫలితాల ఉత్సాహానికి రాహుల్ పర్యటన ఓట్లు కురిపిస్తుందని ఆశిస్తున్నారు.

Last Updated : Apr 2, 2019, 6:59 PM IST

ABOUT THE AUTHOR

...view details