మెడికల్ కళాశాల
'అధికారంలోకి రాగానే ఆదాయపుపన్ను రద్దు చేస్తాం' - mp
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బొగ్గు గని కార్మికులకు ఆదాయపుపన్ను రద్దు చేస్తామని పెద్దపల్లి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలోని అర్జీ-2, గోదావరిఖనిలోని 11వ బొగ్గు గనిలో ప్రచారం నిర్వహించారు.
కార్మికులతో చంద్రశేఖర్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కార్మికులకు ఆదాయపు పన్ను రద్దుతో పాటు... మెడికల్ కళాశాల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెరాస, భాజపాకు ఓటేస్తే కార్మికులకు ఒరిగేది ఏమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు, ఐఎన్టీయూసీ నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:'దాడులు చేసినంత మాత్రాన మోదీకి జైకొట్టం'