తెలంగాణ

telangana

ETV Bharat / city

'రాష్ట్రంలో అగ్రగామిగా పెద్దపల్లి జిల్లాను నిలబెట్టాలి' - ramagundam news

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ మిలీనియం హాల్లో జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్​, ఎంపీ వెంకటేశ్​ నేత పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసి జిల్లా అభివృద్ధికి పాటుపడాలని నేతలు సూచించారు.

'రాష్ట్రంలో అగ్రగామిగా పెద్దపల్లి జిల్లాను నిలబెట్టాలి'
'రాష్ట్రంలో అగ్రగామిగా పెద్దపల్లి జిల్లాను నిలబెట్టాలి'

By

Published : Oct 20, 2020, 10:49 PM IST



ప్రభుత్వ లక్ష్యాల సాధన దిశగా కృషి చేసి రాష్ట్రంలోనే పెద్దపెల్లి జిల్లాను అగ్రగామిగా నిలపాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్​ నేత పేర్కొన్నారు. ఈ మేరకు రామగుండం ఎన్టీపీసీ మిలీనియం హాల్లో జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ సమీక్షాసమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసి జిల్లా అభివృద్ధికి పాటుపడాలన్నారు. అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువగా తీసుకెళ్లాలని సూచించారు.

'రాష్ట్రంలో అగ్రగామిగా పెద్దపల్లి జిల్లాను నిలబెట్టాలి'
'రాష్ట్రంలో అగ్రగామిగా పెద్దపల్లి జిల్లాను నిలబెట్టాలి'

ఈ సందర్భంగా పలు శాఖ అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడంపై ఎంపీ వెంకటేశ్​ నేత అసహనానికి గురయ్యారు. రానున్న సమావేశంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి పనుల సమగ్ర నివేదిక తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్, జిల్లా ఇంఛార్జ్​ కలెక్టర్ భారతి హోళీ కేరి, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపెల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, రామగుండం నగర మేయర్ డాక్టర్ బండి అనిల్ కుమార్ తో పాటు మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్మన్లు పాల్గొన్నారు.

'రాష్ట్రంలో అగ్రగామిగా పెద్దపల్లి జిల్లాను నిలబెట్టాలి'

ఇదీ చూడండి: అల్పపీడన ప్రభావం... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ABOUT THE AUTHOR

...view details