Section 144 Continues in Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో శివాజీ విగ్రహ ఏర్పాటులో నెలకొన్న వివాదంతో పట్టణంలో పోలీసులు ఏర్పాటు చేసిన 144 సెక్షన్ కొనసాగుతోంది. మరోసారి శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఈ సెక్షన్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని జిల్లా పోలీస్ కమిషనర్ నాగరాజు చెప్పారు. ప్రస్తుతం పట్టణంలో ప్రశాంత వాతావరణం ఉందన్నారు.
శివాజీ విగ్రహం వద్ద బారికేడ్ల ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఆర్డీఓ,మున్సిపల్ కమిషనర్ 'ఇరువర్గాల నుంచి 24 మందిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశాం. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను ప్రజలు నమ్మొద్దు. శివాజి విగ్రహం చుట్టూ మున్సిపల్ అధికారులు బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నాం.'
-నాగరాజు, నిజామాబాద్ పోలీస్ కమిషనర్
అదేవిధంగా శివాజీ విగ్రహం వద్ద బారికేడ్ల ఏర్పాట్లను ఆర్డీఓ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ రామలింగం పర్యవేక్షించారు.
బోధన్‌లో కొనసాగుతున్న సెక్షన్ 144 అసలేం జరిగిందంటే...
నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని అంబేడ్కర్ చౌరస్తాలో శివాజీ విగ్రహ ఏర్పాటు ఉద్రిక్తతలకు దారితీసింది. విగ్రహం తొలగించాలని ఓ వర్గం పట్టుబడగా... మరొకరు తీవ్రంగా వ్యతిరేకించారు. వాగ్వాదం క్రమంగా ఘర్షణగా మారి ఇరువర్గాలు పరస్పరం రాళ్లతో దాడిచేసుకున్నారు. పరిస్థితి అదుపుతప్పుతుందని భావించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ విధించారు.
బోధన్‌లో కొనసాగుతున్న సెక్షన్ 144 ఇదీ చదవండి:Picketing In Bodhan: ఇతర ప్రాంతాల నాయకులు బోధన్‌కు రావొద్దు: సీపీ నాగరాజు