కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మల్లుపేట గ్రామ శివారులో మినీ బస్సు బోల్తా పడింది. 20 మంది తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో బస్సులో 5 కుటుంబాలకు చెందినవారున్నారు. హైదరాబాద్ మూసాపేట్‌కు చెందిన 5 కుటుంబాలు ఈ రోజు ఉదయం ఓ మిని బస్సులో బాసరకు బయలుదేరారు.
మినీబస్సు బోల్తా.. 20 మందికి తీవ్రగాయాలు - తాజా రోడ్డు ప్రమాదాలు
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మల్లుపేట గ్రామ శివారులో మినీ బస్సు బోల్తా పడింది. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఐదు కుటుంబాలకు చెందిన వీరంతా బాసరకు వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
మినీబస్సు బోల్తా.. 20 మందికి తీవ్రగాయాలు
తిరుగుప్రయాణంలో మల్లుపేట గ్రామ శివారుకు రాగానే వెనక టైర్ పేలి బస్సు మూడు పల్టీలు కొట్టింది. డ్రైవర్‌తో పాటు బస్సులో ప్రయాణిస్తున్న 12 మంది పెద్దలు, 9 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.