తెలంగాణ

telangana

ETV Bharat / city

సీఎం గిరి వికాస్ పథకంపై కలెక్టర్ సమీక్ష

సీఎం గిరి వికాస్ పథకంపై నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి... అధికారులతో సమీక్షించారు. అర్హులైన గిరిజన రైతులను ఎంపిక చేసి బోర్ వేసి, మోటార్, విద్యుత్ మీటర్ ఏర్పాటు చేస్తామన్నారు.

nizamabd collector narynareddy review on giri vikas scheme
సీఎం గిరి వికాస్ పథకంపై కలెక్టర్ సమీక్ష

By

Published : Sep 7, 2020, 10:27 PM IST


గిరిజన కుటుంబాలకు సీఎం గిరి వికాస్‌ పథకం వరం లాంటిదని నిజామాబాద్ కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్నారు. గిరి వికాస్‌ పథకంపై అధికారులతో కలెక్టరేట్​లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు జిల్లాలో 52 విద్యుత్ మోటార్ల బోర్ డ్రిల్లింగ్ యూనిట్స్ గాను 32 యూనిట్లు పూర్తైనట్టు తెలిపారు. మిగిలిన 20 యూనిట్లు ప్రోగ్రెస్​లో ఉన్నట్టు వివరించారు.

ఎంపీడీవోల ద్వారా అర్హులైన గిరిజన రైతులను ఎంపిక చేసి, వారి భూమిలో వ్యవసాయ బోరు వేసి, మోటారు, విద్యుత్తు మీటరు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్టీవో శ్రీనివాస్, డీటీడీవో సంధ్యారాణి, విద్యుత్ శాఖ, భూగర్భజలాలు శాఖ అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details