తెలంగాణ

telangana

Lock Down: సడలింపు సమయంలో సందడి

By

Published : May 28, 2021, 1:48 PM IST

లాక్​డౌన్ సడలింపు సమయంలో నిజామాబాద్ నగరంలో రద్దీ ఎక్కువగా ఉంటోంది. నిత్యావసర సరకుల కోసం ప్రజలు బయటకు రావడం వల్ల రహదారులన్ని కిటకిటలాడాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

lock down, lock down in nizamabad
లాక్​డౌన్, నిజామాబాద్​లో లాక్​డౌన్, నిజామాబాద్​ నగరంలో లాక్​డౌన్

లాక్​డౌన్ సడలింపు సమయంలో నిజామాబాద్ నగరంలోని రహదారులన్ని కిటకిటలాడాయి. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ప్రజలు బయటకు రావడం వల్ల నగరం సందడిగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు భౌతిక దూరం పాటించలేదు. కూరగాయల మార్కెట్, దుకాాలు, మద్యం షాపులు.. వంటి ప్రాంతాల్లో కొవిడ్ నిబంధనలను ప్రజలు గాలికొదిలేశారు. పలు ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.

సడలింపు సమయం దాటిన తర్వాత.. రహదారులపైకి వచ్చిన వారిపై పోలీసులు కొరడా ఝుళిపించారు. 10 గంటలు దాటిన తర్వాత బయటకు వచ్చిన వారిని అడ్డుకున్న పోలీసులు.. వాహనాలను సీజ్ చేస్తున్నారు. లాక్​డౌన్ సమయంలో బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ప్రజలంతా ఆంక్షలు పాటిస్తూ తమకు సహకరించాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details