న్యాయవాద దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇందులో పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు పాత్రపై విచారణ జరపాలని కోరారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్ట మధును పదవి నుంచి తప్పించాలన్నారు.
'పోలీసుల నిర్లక్ష్యం వల్లే వామన్ రావు దంపతుల హత్య'
పోలీసులు నిర్లక్ష్యం వల్లే న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు పాత్రపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
'పోలీసుల నిర్లక్ష్యం వల్లే వామన్ రావు దంపతుల హత్య'
పోలీసులు అధికార పార్టీకి మద్దతుగా వ్యవహరించడం వల్లే వామన్ రావు దంపతుల హత్య జరిగిందని జీవన్ రెడ్డి ఆరోపించారు. పుట్ట లింగమ్మ ట్రస్ట్ కార్యకలాపాలు నిలిపివేసేందుకు కారణమయ్యారనే కక్షతోనే హత్యకు పాల్పడ్డారని విమర్శించారు. అసలైన దోషులకు శిక్ష పడాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చూడండి :కత్తుల కోసం రెండో రోజు బ్యారేజీలో గాలింపు
Last Updated : Mar 1, 2021, 3:17 PM IST