'ముథోల్‌లో ఎన్నికల పరిశీలకుల పర్యటన' నిర్మల్ జిల్లా ముథోల్‌లో ఎన్నికల ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్‌ను ఆదిలాబాద్ పార్లమెంటరీ జనరల్ పరిశీలకులు సంజయ్ కుమార్ తనిఖీ చేశారు. ముందుగా ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలోని 230, 231 పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో తాగునీరు, విద్యుత్ సౌకర్యం, దివ్యాంగ ఓటర్ల కొరకు ఏర్పాటు చేసిన ర్యాంపులను చూసి పలు సూచనలు చేశారు.
స్ట్రాంగ్ రూమ్ పరిశీలన
అనంతరం సాంఘిక సంక్షేమగురుకుల పాఠశాలలోని స్ట్రాంగ్ రూమ్ పరిశీలించారు, ఏర్పాట్లపైతహసీల్దార్ను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు సక్రమంగా జరిగే విధంగా చూడాలని ఆదేశించారు. అందరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ దక్షిణామూర్తి, ఆర్డీవో రాజు, డీఎస్పీ రాజేష్ బల్ల తదితరులు పాల్గొన్నారు.