భిక్షాటన చేసిన టీఆర్టీ ఉత్తీర్ణులు - dharna
2017 లో టిఆర్టికి ఎంపికైనా ఇప్పటి వరకు నియామక పత్రాలు ఇవ్వకపోవడంపై అభ్యర్థులు మండిపడ్డారు. నిరసనగా భిక్షాటన చేస్తూ... ముఖ్యమంత్రి స్పందించాలని డీఈవోకు వినతిపత్రం అందించారు.
టీఆర్టీ ఉత్తీర్ణుల ధర్నా
నల్గొండ కేంద్రంలో ఉపాధ్యాయ నియామక పరిక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు భిక్షాటన చేశారు. 2017లో టీఆర్టీకి ఎంపికైనా... ఇప్పటి వరకు నియామక పత్రాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నియమించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి తమ బాధను అర్థం చేసుకుని త్వరగా పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. డీఈవో అధికారికి వినతిపత్రం అందించారు.