ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇవాళ ఏడుగురికి కరోనా సోకింది. నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున కొవిడ్ బారిన పడ్డారు. సూర్యాపేట జిల్లాలో ఒకరికి వ్యాధి సోకింది.
వైద్యారోగ్య అధికారుల లెక్కల ప్రకారం... మూడు జిల్లాల్లో ఇప్పటి వరకు 209 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 20 మంది వలస కూలీలున్నారు.
ఇవాళ నిర్ధరణ అయిన వాటిలో దేవరకొండ, కొండమల్లేపల్లి, మిర్యాలగూడ, చౌటుప్పల్, వలిగొండ, భూదాన్ పోచంపల్లి, కోదాడ మండలాలకు చెందినవారున్నారు. గత నాలుగు రోజుల్లో విస్తృతంగా కేసులు బయటపడ్డాయి. ఫలితంగా పెద్దఎత్తున నమూనాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 230 మంది ఫలితాలు రావాల్సి ఉంది.
ఇవీచూడండి:రాష్ట్రంలో మరో 945 కరోనా పాజిటివ్ కేసులు నమోదు