షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
లక్ష్మీ నారసింహుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే - yadadri latest news
యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనానికి తరలివస్తున్నారు. షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
లక్ష్మీ నారసింహుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే
స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని అర్చకులు ఎమ్మెల్యేకు అందజేశారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలని కోరుకున్నట్లు అంజయ్య తెలిపారు. సీఎం ప్రత్యేక చొరవతో యాదాద్రి అభివృద్ధి చెందుతుందన్నారు.
ఇవీ చూడండి: ఆర్టీసీ బస్సుల్లో పైరసీ... స్పందించిన కేటీఆర్