సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండలకేంద్రంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి తండ్రి దివంగత అంకిరెడ్డి స్మారకార్థం రైతు వేదికను నిర్మించేందుకు తలపెట్టిన శంకుస్థాపన కార్యక్రమాన్ని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. రైతు వేదికల నిర్మాణంతో రైతులకు ఇది నూతన అధ్యాయమని మంత్రి తెలిపారు.
మఠంపల్లిలో రైతు వేదికకు మంత్రి జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన - minister jagadish reddy started rythu vedika works at matampally
హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి తండ్రి దివంగత అంకిరెడ్డి స్మారకార్థం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో నిర్మించనున్న రైతు వేదికకు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రైతు వేదికల నిర్మాణం.. నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు.
మఠంపల్లిలో రైతు వేదికకు మంత్రి జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన
అన్నదాతను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు సీఎం కేసీఆర్ రైతు వేదికలకు సంకల్పించామన్నారు. మిషన్ కాకతీయ పథకంతో చెరువుల పునరుద్ధరణ చేపట్టి కృష్ణా, గోదావరి జలాలను మళ్లించామని, రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయ రుణాల మాఫీలతో ప్రభుత్వం అన్నదాతలకు పెద్దపీట వేసిందని మంత్రి అన్నారు.
ఇదీ చదవండి:కరోనా సంక్షోభంలో ల్యాప్‌టాప్ అమ్మకాల జోరు