తెలంగాణ

telangana

ETV Bharat / city

నిధులు ఇవ్వని సీఎం, మునుగోడు ఎలా వస్తారని ప్రశ్నించిన రాజగోపాల్‌ రెడ్డి - వివేక్ తాజా వార్తలు

Rajagopal Reddy Fires on CM Kcr నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి నిధులు ఇవ్వని సీఎం కేసీఆర్.. మునుగోడు ఎలా వస్తారని భాజపా నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ప్రశ్నించారు. సిరిసిల్ల, గజ్వేల్‌ నియోజకవర్గానికి ఎంత ఖర్చు చేశారో... మునుగోడుకి ఎంత మేరకు నిధులు ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. నిధులు కేటాయించనందుకు మునుగోడు ప్రజలకు సీఎం కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని అన్నారు.

rajagopalreddy
rajagopalreddy

By

Published : Aug 19, 2022, 2:03 PM IST

Updated : Aug 19, 2022, 2:17 PM IST

Rajagopal Reddy Fires on CM Kcr: సిరిసిల్ల, గజ్వేల్‌ నియోజకవర్గానికి ఎంత ఖర్చు చేశారో... మునుగోడుకి ఎంత మేరకు నిధులు ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని భాజపా నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాలని శాసనసభ వేదికగా ప్రశ్నించినా... రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదని మండిపడ్డారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి నిధులు ఇవ్వని సీఎం కేసీఆర్.. మునుగోడు ఎలా వస్తారని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ప్రశ్నించారు. నిధులు కేటాయించనందుకు మునుగోడు ప్రజలకు సీఎం కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అమిత్‌షా సమక్షంలో భారీగా చేరికలున్నాయని.. అందుకు భయపడే.. కేసీఆర్‌ రేపు సభ ఏర్పాటు చేసుకున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్‌ ఆరోపించారు.

నిధులు ఇవ్వని సీఎం, మునుగోడు ఎలా వస్తారని ప్రశ్నించిన రాజగోపాల్‌ రెడ్డి

'ఎనిమిదిన్నరేళ్లలో మనుగోడుకు సర్కారు ఒక్కరూపాయి ఇవ్వలే. నిధులు ఇవ్వని సీఎం మునుగోడు ఎలా వస్తారు?ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే సీఎం కేసీఆర్‌ మునుగోడుకి రావాలి. 21న మునుగోడులో అమిత్‌షా సభ ఉంటుందని నెల ముందే చెప్పాం. కావాలనే కుట్రపూరితంగా సీఎం కేసీఆర్‌ రేపు సభ పెట్టారు'.- కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే

ఇవీ చదవండి:

Last Updated : Aug 19, 2022, 2:17 PM IST

ABOUT THE AUTHOR

...view details