లాక్డౌన్ నిబంధనలు సడలించడం.. అంతర్రాష్ట్ర ప్రయాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం ఫలితంగా తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు ఎక్కువయ్యాయి. తెలంగాణ నుంచి ఏపీలోనికి వెళ్లేవారికి పాస్లు ఉంటేనే ఆ రాష్ట్ర పోలీసులు అనుమతిస్తున్నారు. లేనివారి ఆధార్ సంఖ్యలు నమోదు చేసుకొని.. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం హోం క్యారంటైన్ ముద్ర వేసి అనుమతిస్తున్నారు.
'అనుమతి కావాలి.. హోం క్వారంటైన్లోనైనా ఉండాలి' - తెలంగాణ తాజా వార్తలు
అంతర్రాష్ట్ర ప్రయాణాలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం ఎత్తివేత ఫలితంగా తెలుగు రాష్ట్రాల సరిహద్దు వద్ద రాకపోకలు ఎక్కువయ్యాయి. తెలంగాణ నుంచి వెళ్లేవారికి పాస్ ఉంటేనే ఏపీలోనికి అనుమతిస్తున్నారు అక్కడి పోలీసులు. లేకుంటే వైద్య పరీక్షలు నిర్వహించి.. హోం క్వారంటైన్ ముద్ర వేసి పంపిస్తున్నారు.
అనుమతి కావాలి.. హోం క్వారంటైన్లోనైనా ఉండాలి
నాగార్జునసాగర్ సరిహద్దు వద్ద తెలంగాణ నుంచి ఏపీలోని గుంటూరు జిల్లా మాచర్లకు పత్తి విత్తనాల కోసం వెళ్లిన వారిని అనుమతించడం లేదు. పత్తి విత్తనాల ఏజెంట్లను రైతుల వద్దకు పంపిస్తామని.. ఎవరూ అనుమతి లేకుండా రావొద్దంటూ ఇరు రాష్ట్రాల పోలీసులు సూచిస్తున్నారు. సరిహద్దుల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.