నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్పీటీ మార్కెట్లో బట్టల దుకాణాలు వినియోగదారులతో కళకళలాడుతున్నాయి. శ్రావణమాసంలో రాఖీ, రంజాన్, బోనాల పండుగలతో పాటు పెళ్లి ముహూర్తాలు కూడా ఉండటంతో అధిక సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారని దుకాణదారులు చెబుతున్నారు. జిల్లాలో ఈ నెల 30 లేదా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 14 వరకు స్వచ్ఛందంగా లాక్డౌన్ అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తుండటం వల్ల ముందుగానే కొనుగోలు చేస్తున్నట్లు కొనుగోలుదారులు అంటున్నారు.
నల్గొండలో వినియోగదారులతో కళకళలాడుతున్న దుకాణాలు
కరోనా ప్రభావంతో దుకాణాలకు వెళ్లాలంటేనే భయపడ్డ ప్రజలు... శ్రావణమాసం రాగానే షాపింగ్లు చేస్తున్నారు. నల్గొండ పట్టణంలోని ఎస్పీటీ మార్కెట్లో బట్టల దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. పెళ్లిలు, పండుగలతో పాటు స్వచ్ఛంద లాక్డౌన్ అమలుచేయాలన్న తలంపు వల్లే ప్రజలు ముందస్తు కొనుగోలు చేస్తున్నారని దుకాణాదారులు చెబుతున్నారు.
heavy flow to cloth stores in nalgonda spt market
గతంలోనే రెండు నెలల లాక్డౌన్ వల్ల బట్టలు అమ్ముడుపోక తీవ్రంగా ఇబ్బందులు పడ్డామని... జీతాలు ఇవ్వలేక, అద్దెలు కట్టలేక సతమతమయ్యామని ఆవేదన వ్యక్తంచేశారు. పెళ్లిళ్లు, పండుగల సీజన్ కాబట్టి తమకు అమ్ముడు పోయేది ఇప్పుడేనని... మళ్లీ ఈ సమయంలో లాక్డౌన్ అమలు చేయటం వల్ల తమకు చాలా నష్టం జరుగుతుందని దుకాణాదారులు వాపోతున్నారు.