తెలంగాణ

telangana

ETV Bharat / city

ధనస్సు రాశి వారికి 2021 ఎలా ఉండబోతోంది.?

ధనస్సు రాశి వారికి 2021 ఎలా ఉండబోతోంది. కొత్త ఏడాది ఈ రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి..? ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యస్థితి ఎలా ఉంటుంది. సమగ్ర వివరాలు మీకోసం..!

libra
libra

By

Published : Dec 31, 2020, 10:56 PM IST

ఈ సంవత్సరం మీకు సానుకూలంగా ఉంటుంది. ప్రారంభం సంతోషకరంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతమవుతుంది. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉంటారు. మీ ధైర్యం, నైపుణ్యం మీకు విజయాన్ని అందిస్తాయి. మీ పోటీదారులు కూడా భయపడతారు. కోర్టు, ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన మీలో ఉంటుంది. మీ దృష్టంతా కుటుంబంపైనే ఉంటుంది. మీ కుటుంబ జీవితం ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది.

పెద్దల మార్గదర్శనంతో మీరు మీ పాత పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. దీంతో కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. విదేశాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు అయితే ఈ సంవత్సరం అవకాశం రావచ్చు దాని కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి. మీ తల్లి తరపు బంధువుల నుంచి మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి వారితో సఖ్యతగా ఉండటం మంచిది. స్థిరాస్తికి సంబంధించి మీరు లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. మీ కంటే చిన్నవారైన తోబుట్టువుల నుంచి మీరు కొన్ని ప్రయోజనాలు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆర్థికంగా మీకు అవసరమైనప్పుడు స్థాయి మేరకు వారు మీకు సాయమందిస్తారు. మీ స్నేహితులు మీకు వెన్నుపోటు పొడవచ్చు. మీకు అత్యంత సన్నిహితుల్లో ఒకరు మీకు వ్యతిరేకంగా వ్యవహరించే సూచనలున్నాయి కాబట్టి జాగ్రత్త. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు నిమగ్నమై ఉంటారు, అది మీకు మనశ్శాంతిని అందిస్తుంది. ఆధ్యాత్మిక పర్యటనలకు మీరు వెళ్లే సూచనలున్నాయి. ఆరోగ్యం సవ్యంగా ఉంటుంది. కాని స్వల్ప సమస్యలు ఉంటాయి, వారి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం మీరు పెద్దవారు ఒకరితో తీవ్రమైన వాదనకు దిగుతారు. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోండి, ప్రశాంతంగా ఉండండి. కుటుంబసభ్యుల్లో ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని ఈ సంవత్సరం ఆందోళనకు గురిచేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details