మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటి వరకు 7 కేసులు నమోదు కాగా.. అందులో 5 కేసులు మహబూబ్ నగర్ పట్టణంలో నమోదయ్యాయన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ రెవిన్యూ మీటింగ్ హాల్లో ఆయన జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఇప్పటివరకు కరోనా సోకిన వారిని చికిత్స కోసం హైదరాబాద్ తరలించామని, వారితో సన్నిహితంగా ఉన్నవారిని క్వారంటైన్లో ఉంచామని తెలిపారు.
కరోనా నివారణకు ప్రజలు సహకరించాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఇప్పటి వరకు మహబూబ్నగర్ జిల్లాలో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
కరోనా నివారణకు ప్రజలు సహకరించాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
జిల్లాలో మరిన్ని కేసులు నమోదు కాకుండా ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్య సిబ్బందిని ఆయన కొనియాడారు. ప్రజలంతా వైద్యులకు సహకరించాలని కోరారు. ప్రజలకు కావలసిన వస్తువులన్నీ ఇంటికే వస్తాయని, ఎవరూ రోడ్ల మీదకు రావొద్దని, సామాజిక దూరం పాటించాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎక్కడ కరోనా అనుమానితులు కనిపించినా.. అధికారులకు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఇవీ చూడండి : సాయం చేయాలనుకుంటే.. వాట్సప్ చేయండి!