హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తెరాస అభ్యర్థి వాణీదేవి విజయం తథ్యమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన పట్టభద్రులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో 55 శాతంగా ఉన్న పోలింగ్ శాతం ఈసారి పెరగడంపై శ్రీనివాస్‌గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజా చైతన్యానికిది నిదర్శనమన్నారు. ప్రజల తీర్పును గౌరవిస్తామని, ఫలితాల అనంతరం మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.