కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల్లో చేరిన నేతలపై మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి నిప్పులు చెరిగారు. నారాయణపేట జిల్లా మక్తల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విస్త్రృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. అధికారంలో ఉన్నంత కాలం పదవులు అనుభవించిన వారు కష్ట కాలంలో పార్టీకి అండగా నిలబడాల్సిన వారు పక్కచూపులు చూడడం సబబు కాదన్నారు. మక్తల్ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిచే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు.
'కష్టకాలంలో అండగా ఉండకుండా పార్టీలు మారుతారా' - 2019 elections
అధికారంలో ఉన్నంత కాలం పదవులు అనుభవించి, నేడు పార్టీ కష్టాల్లో ఉంటే పక్కచూపులు చూడడం న్యాయమేనా అని మహబూబ్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్‌రెడ్డి ప్రశ్నించారు.
మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి