తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎన్నికల తర్వాత కేసీఆర్​ పీఎం, కేటీఆర్​ సీఎం ! - mahamud ali

సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధానిగా కేసీఆర్​, ముఖ్యమంత్రిగా కేటీఆర్​ ఉంటారని హోంమంత్రి మహమూద్​ అలీ అన్నారు. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్​ గౌడ్​తో కలిసి ప్రచారం నిర్వహించారు.

మహమూద్​ అలీ

By

Published : Apr 2, 2019, 8:09 PM IST

ఎన్నికల తర్వాత తండ్రి పీఎం.. కొడుకు సీఎం..!
తెరాసకు ఓటు వేస్తే భాజపాకు వేసినట్లేనని తప్పుడు ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి మహమూద్​ అలీ మండిపడ్డారు. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలోని మోతీనగర్​లో మంత్రి శ్రీనివాస్​ గౌడ్​తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత కేసీఆర్​ ప్రధానిగా, కేటీఆర్​ ముఖ్యమంత్రిగా ఉంటారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్​ పార్టీ ఉనికిని కోల్పోయిందన్నారు. కారు గుర్తుకు ఓటేసి మన్నేశ్రీనివాస్​ రెడ్డిని గెలిపించాలని కోరారు.

70 ఏళ్లు పాలన

కాంగ్రెస్​, భాజపా రెండు ఒకటేనని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ అన్నారు. 70 ఏళ్లు పాలించి చేసిందేమీ లేదని విమర్శించారు. కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.


ఇవీ చూడండి:"మోదీ ప్రధాని కాదు... దొంగలకు చౌకీదార్"

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details