తెలంగాణ

telangana

ETV Bharat / city

బడిని బాగు చేసుకున్నరు! - Narayanapeta

మనిషి అనుకుంటే దేన్నైనా సాధ్యం చేసి చూపిస్తాడని నారాయణపేట జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు రుజువు చేసి చూపించాడు. గ్రామస్థుల సహకారంతో ఊరి బడిని బాగు చేసుకున్నాడు. పాత పాఠశాలకు కొత్త కళ తీసుకొచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.

Govt.Teacher built school
బడిని బాగు చేసుకున్నరు!

By

Published : Feb 22, 2020, 6:56 AM IST

బడిని బాగు చేసుకున్నరు!

మంచి చేయాలన్న ఆలోచన ఉంటే.. మనకు తెలియకుండానే నలుగురి సహాయం అందుతుంది. శిథిలావస్థలో ఉన్న ఆ ఊరి బడిని బాగు చేయాలన్న ఆ ఉపాధ్యాయుడి ఆలోచనకు గ్రామ ప్రజల సహకారం కూడా తోడయింది. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం పాతపల్లిలో ప్రాథమిక పాఠశాల భవనం శిధిలావస్థకు చేరింది. ఆ సమయంలో పాఠశాలకు రామకృష్ణ ప్రధానోపాధ్యాయుడిగా విధుల్లో చేరాడు. బడి ముందు అంతా చెత్త కుప్పలు, పక్కనే అధ్వాన్న స్థితిలో అంగన్ వాడీ భవనం ఉన్నాయి. దీనికి తోడు ఆ పాఠశాలలో పిల్లల సంఖ్య మరీ తక్కువగా ఉంది. ఎలాగైనా పరిస్థితిలో మార్పు తేవాలనుకున్నాడు ఆ ఉపాధ్యాయుడు.

చేయి చేయి కలిపి..

పిల్లల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశారు రామకృష్ణ. స్కూల్ కమిటీ చైర్మన్​తో మాట్లాడి.. గ్రామస్థులంతా కలిసి పాఠశాల నిర్మాణానికి చందాలు ఇచ్చేందుకు ఒప్పించారు. అందరూ కలిసి యాభై వేల రూపాయలు ప్రధానోపాధ్యాయడు రామకృష్ణకు ఇచ్చారు. కొన్ని రోజుల్లోనే పాఠశాలకు కొత్త భవనం నిర్మాణం ఆయింది. ఇందుకు గానూ.. మొత్తం లక్ష ఎనభై వేల రూపాయలు ఖర్చయ్యాయి. గ్రామస్తులు ఇచ్చిన యాభై వేలకు తాను సొంతంగా లక్షా ముప్పై వేలు కలిపి పాఠశాల భవనం పూర్తి చేశాడు.

బడి ఆకట్టుకునేలా..

భవన నిర్మాణం అనంతరం క్రమంగా విద్యార్ధుల సంఖ్య పెరిగింది. బడి ముందు ఖాళీ స్థలంలో మొక్కలు, చెట్లు నాటి, వాటి బాధ్యత పిల్లలకే అప్పజెప్పారు. ఇప్పుడు పాఠశాల ప్రాంగణం ఆకర్షణీయంగా మారింది. దీనికి తోడు.. పాఠశాల గోడల మీద రాష్ట్రాలు, జిల్లాలు, పక్షులు, జంతువులు, జాతీయ నాయకుల ఫొటోలు అందంగా పెయింటింగ్ చేయించారు. ప్రభుత్వ సహాయం లేకుండానే బడిని బాగు చేసుకున్నారు. పాతపల్లిలోని ప్రజా ప్రతినిధులు సైతం పాఠశాల అభివృద్ధికి మేము సైతం అంటు స్వచ్ఛంధంగా పలు అభివృద్ధి పనులు చేపట్టారు. అందరి కృషి, ప్రధానోపాధ్యాయుని సంకల్పంతో.. పాతపల్లి బడి కొత్త వెలుగులతో కళకళలాడుతూ.. మిగతా ప్రభుత్వ పాఠశాలలకు ఆదర్శంగా నిలిచింది.

ABOUT THE AUTHOR

...view details