జోగులాంబ గద్వాల జిల్లాలో 61 కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 49 కేంద్రాలు ప్రారంభించగా.. 45 చోట్ల ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నారు. యాసంగిలో 49,400 మెట్రిక్ టన్నులు లక్ష్యంగా నిర్ధేశించుకున్నా.. ఇప్పటి వరకు 7,072 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. ఒక్కో కేంద్రంలో.. హమాలీ ఖర్చులనూ రైతులే భరిస్తున్నారు. 40 కిలోల బస్తాకు ఒక్కో కేంద్రంలో ఒక్కో విధంగా వసూళ్లు చేస్తున్నారు.
జిల్లా మొత్తంగా ఇదే తంతు..
తుర్కోనిపల్లి కేంద్రంలో 100 కిలోలకు రూ.40 తీసుకుంటుండగా నది అగ్రహారం, చెనుగోనిపల్లి కేంద్రాల్లో హమాలీ ఖర్చులు రూ.45 వసూలు చేస్తున్నారు. జిల్లా మొత్తంగా ఇదే తంతు కొనసాగుతోంది. పొలం నుంచి కొనుగోలు కేంద్రానికి చేర్చేందుకే ఒక్కో ట్రాక్టర్‌కు రూ.700 వరకు ఖర్చు చేస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.