తెలంగాణ

telangana

ETV Bharat / city

తొలిరోజు హరితహారంలో 16 లక్షల మొక్కలు - ఆరో విడత హరితహారం

ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మహబూబ్​నగర్ జిల్లాలో తొలిరోజు 16 లక్షల మొక్కలు నాటినట్లు అధికారులు తెలిపారు. గండీడ్ మండలంలో అత్యధికంగా 2 లక్షల 96 వేల మొక్కలు నాటారు.

16 lakhs plants in first day harithaharam
తొలిరోజు హరితహారంలో 16 లక్షల మొక్కలు

By

Published : Jun 26, 2020, 4:50 AM IST

మహబూబ్​నగర్ జిల్లాలో ఆరో విడత హరితహారంలో భాగంగా.. తొలి రోజు 20 లక్షల మొక్కలు నాటాలన్న లక్ష్యంతో అధికార యంత్రాగం చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలిచ్చాయి. జిల్లాలోని మొత్తం 15 మండలాల్లో 16 లక్షల మొక్కలు నాటినట్లు అధికారులు ప్రకటించారు.

వీటిలో గండీడ్ మండలంలో అత్యధికంగా 2 లక్షల 96 వేల మొక్కలు నాటారు. ఆరు మండలాల్లో లక్షకు పైగా మొక్కలు నాటారు. 440 గ్రామాల్లో 15 లక్షల75 వేల మొక్కలు నాటగా... జిల్లా అధికారుల ఆధ్వర్యంలో సుమారు 70వేల మొక్కలు నాటారు.

నారాయణపేట జిల్లాలో 22 వేలు, వనపర్తి జిల్లాలో లక్షా 12 వేలు, నాగర్​కర్నూల్ జిల్లాలో 90 వేలు, జోగులాంబ గద్వాల జిల్లాలో 56 వేల మొక్కలు తొలిరోజు నాటినట్లు సమాచారం. రోజువారీ నివేదికల్లో మహబూబ్​నగర్.. అన్ని జిల్లాల కంటే ముందుంది.

ఇదీ చదవండి:ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా.. గ్రేటర్​లో హరిత సంబురం

ABOUT THE AUTHOR

...view details